జాతీయ వార్తలు

అయోధ్యపై సుప్రీం ఇచ్చే తీర్పు ప్రభావం.. భావితరాలపై తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: అయోధ్య భూ వివాదంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా దాని ప్రభావం భవిష్యత్ తరాలపై ఎంతో ఉంటుందని, అలాగే దీని పర్యవసానాలు దేశ రాజకీయాలపైనా ప్రభావం చూపుతాయని ముస్లిం వర్గాలు సుప్రీంకోర్టుకు అందించిన ఒక లిఖితపూర్వక పత్రంలో స్పష్టం చేశాయి. సున్నీ వక్ఫ్‌బోర్డు సహా పలు ముస్లిం పార్టీలు తమ అభిప్రాయాలతో కూడిన ఈ పత్రాన్ని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి అందించాయి. అయోధ్యపై 40 రోజుల పాటు దైనందిన విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈనెల 16న తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారమే సీల్డు కవర్‌లో తాము ఈ లిఖితపత్రాన్ని దాఖ లు చేశామని, కానీ కోర్టు రిజిస్ట్రీ మాత్రం దీనిని స్వీకరించేందుకు నిరాకరించిందని సున్నీ వక్ఫ్‌బోర్డు, ముస్లిం కక్షిదారులైన సిద్ధిఖి మహమ్మద్ ఖాసింల వారసులు త్రిసభ్య బెంచ్‌కి నివేదించారు.