జాతీయ వార్తలు

బెంగాల్‌లో సెన్సార్‌షిప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 22: పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య తలెత్తిన వివాదం తలెత్తిన వివాదం ముదురుపాకాన పడుతోంది. దుర్గా పూజలో తనను అవమానించారన్న దగ్గర నుంచి తాజాగా తనను అధికారులే పట్టించుకోవడం లేదంటూ గవర్నర్ జగదీప్ దిన్‌కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తనతో రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని గవర్నర్ తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రంలో సెన్సార్‌షిప్ అమలవుతోందని, జిల్లా అధికారులు తనను కలవడమే మానేశారని ఆయన అన్నారు. గవర్నర్ జరిపే సమావేశాలకు హాజరు కావాలంటే ప్రభుత్వ అనుమతి కావాలని అధికారులు చెప్పడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఒకరకమైన సెన్సార్‌షిప్ అమలవుతోందని అన్నారు. గవర్నర్ పిలిచిన సమావేశాలకు అధికారులు హాజరుకాకపోవడం అన్నది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఉత్తర, దక్షిణ, 24 పరగణాల జిల్లాల పర్యటన చేపట్టిన గవర్నర్ అక్కడి జిల్లా మేజిస్ట్రేట్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే, సోమవారం సాయంత్రమే ఇద్దరు జిల్లా మేజిస్ట్రేట్ల నుంచి తమకు లేఖలు అందాయని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ పర్యటనలో నిమగ్నమైన తాము గవర్నర్ జరిపే సమావేశాలకు హాజరు కాలేమంటూ ఈ లేఖల్లో స్పష్టం చేశారని గవర్నర్ కార్యాలయం తెలిపింది. అయితే, గవర్నర్ పర్యటనకు సంబంధించి ఇతర ఏర్పాట్లు మాత్రం సజావుగానే జరుగుతాయని ఈ అధికారులు హామీ ఇచ్చినట్టుగా రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మాట్లాడిన గవర్నర్ ‘చాలా ముందుగానే నేను నా పర్యటన గురించి అధికారులకు తెలిపాను. అయితే, నాలుగు రోజుల తర్వాత వారి నుంచి ఈ రకమైన లేఖ అందింది. ఇది రాష్ట్రంలో ఒకరకమైన సెన్సార్‌షిప్ కాక మరేమిటి?’ అని వ్యాఖ్యానించారు. తాను జరిపే సమావేశాలకు అధికారులు హాజరైనా కాకపోయినా తన పర్యటన సాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఓ జిల్లాలో పర్యటిస్తుంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే సెలవు తీసుకుంటుందా అన్న విస్మయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పైగా, గవర్నర్ నిర్వహించే సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పేర్కొన్న ఆయన ‘నేను రాష్ట్ర ప్రభుత్వానికి దాసోహం చేసేవాడిని కాను. అధికారుల చర్యను రాజ్యాంగ విరుద్ధంగానే పరిగణిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ధమా ఖల్లీలో గవర్నర్ సైనిక వందనం అందించినప్పటికీ ఆ కార్యక్రమానికి ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ ప్రభుత్వ అధికారులెవరూ హాజరు కాలేదు. దక్షిణ 24 జిల్లాల పరగణాల్లో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ఆయన సమావేశానికి రాలేదు. దీనిపై వ్యాఖ్యానించడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిరాకరించింది. దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గవర్నర్‌ను అవమానించడంగానే ఉంది. గవర్నర్ పట్ల తన రాజ్యాంగ బాధ్యతలను, సంప్రదాయాలను ప్రభుత్వం విస్మరిస్తోంది. తన సొంత పద్ధతుల్లోనే మమత సర్కారు వ్యవహరిస్తోంది’ అని అన్నారు.

*చిత్రం... గవర్నర్ జగదీప్ దిన్‌కర్