జాతీయ వార్తలు

నేరాల నెలవు యూపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలో జరుగుతున్న నేరాలు- ఘోరాల్లో ఉత్తర్ ప్రదేశ్ నెంబర్-1 స్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నిలిచాయి.
నేషనల్ క్రైం రిసెర్చ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) 2017 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2017 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 30,62,579 కేసులు నమోదు అయ్యాయి. 2016 సంవత్సరంలో 29,75,711 కేసులు, 2015లో 29,49,400 కేసులు రిజిష్టర్ అయినట్లు బ్యూరో మంగళవారం వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో 3,10,084 కేసులు (2017) నమోదయ్యాయి. అంటే దేశంలో జరుగుతున్న నేరాల్లో 10 శాతం ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే అవుతున్నట్లు క్రైం బ్యూరో తెలిపింది. యూపీలో 2016 సంవత్సరంలో 2,82,171 కేసులు, 2015 సంవత్సరంలో 2,41,920 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో జరుగుతున్న నేరాల్లో యూపీ తర్వాత స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. దేశంలో జరుగుతున్న నేరాల్లో మహారాష్టల్రోనే 9.4 శాతం జరిగినట్లు ఎన్‌సీఆర్‌బి తెలిపింది. 2017 సంవత్సరంలో 2,88,879 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 2016 సంవత్సరంలో 2,61,714 కేసులు, 2015 సంవత్సరంలో 2,75,414 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. దేశంలో జరిగిన నేరాలు-ఘోరాల్లో మధ్య ప్రదేశ్ 8.8 శాతంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో 2017 సంవత్సరంలో 2,69,512 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 2015 సంవత్సరంలో 2,64,418 కేసులు, 2016 సంవత్సరంలో 2,64,418 కేసులు నమోదు అయ్యాయి. ఇలాఉండగా యూపీ, ఢిల్లీలో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసును కల్పించిందని, దీంతో పాటు వాహనాల దొంగతనాలను, ఇంకా పలు దొంగతనాలను ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందని ఎన్‌సీఆర్‌బి వివరించింది. ఈ రాష్ట్రాల తర్వాత కేరళ నిలిచింది.
2017 సంవత్సరంలో కేరళలో 2,35,846 కేసులు రిజిష్టర్ కాగా, అదే ఏడాదిలో ఢిల్లీలో 2,32,066 కేసులు నమోదు అయ్యాయి. 2017 సంవత్సరంలో బీహార్‌లో 1,80,573 (5.9 శాతం) కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో 2017 సంవత్సరంలో 1,63,999 కేసులు (5.4 శాతం) నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బి వెల్లడించింది.