జాతీయ వార్తలు

గవర్నర్ల ప్రాధాన్యం తగ్గుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, అక్టోబర్ 22: దేశంలో గవర్నర్ల ప్రాధాన్యత ఎప్పటికప్పుడు బలహీనపడుతోందని జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మంగళవారంనాడు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేశారు.
తన మనసు విప్పి మాట్లాడే అవకాశం గానీ, పత్రికా సమావేశం నిర్వహించే హక్కు గానీ లేకుండా పోయిందని అన్నారు. దీని బట్టి చూస్తే ఒక్క కాశ్మీర్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ చాలా బలహీనంగానే ఉందని పేర్కొన్న ఆయన దేశంలో కొందరు సంపన్నులను కుళ్లిపోయిన బంగాళాదుంపలుగా అభివర్ణించారు. వీరెవరు కూడా ఎలాంటి దాతృత్వ కార్యకలాపాలు చేపట్టరని, విద్యావ్యవస్థను మెరుగుపరిచే చర్య లూ తీసుకోరని అన్నారు.
గత మూడు రోజులుగా తాను తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నా ఢిల్లీలోని పెద్దలు తన ఆవేదనే ఆలకించడం లేదని మాలిక్ పేర్కొన్నారు. మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవంలో మాట్లాడిన సందర్భంగా గవర్నర్ తన మనోభావాలను వెళ్లగక్కారు.

*చిత్రం... కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్