జాతీయ వార్తలు

ఈవీఎంల మాయేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 22: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందన్న ఎగ్జిట్‌పోల్స్ కథనాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ చూస్తుంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)పై తనకు అనుమానం కలుగుతోందని మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ మూడింట రెండు మెజారిటీతో సీట్లు దక్కించుకుంటుందని మీడియా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మహారాష్టల్రో ఎన్నికల ప్రచారం ముగించుకున్న సిద్దరామయ్య సోలాపూర్ నుంచి రోడ్ మార్గం గుండా హైదరాబాద్ వచ్చారు. అక్కడ నుంచి హుబ్బళ్లీ చేరుకున్న ఆయన మీడియాతోమాట్లాడారు. ‘మహారాష్టల్రో రోడ్లు దారుణంగా ఉన్నాయి. హైవేలు, రోడ్ల మంత్రి నితీన్ గడ్కరీకి చెందిన రాష్ట్రంలోనే రోడ్లు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే జనం ఏం చూసి బీజేపీకి ఓట్లేశారని అనుకోవాలి?. ఎన్‌డీఏ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఇదేనా?’అని మాజీ సీఎం ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజలు ఏం చూసి బీజేపీకి ఓట్లేశారో..నాకయితే అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ‘ఈవీఎంలను గానీ దుర్వినియోగం చేసి గెలుస్తున్నారో ఏమో నాకయితే తెలియదు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అదుపుఆజ్ఞల్లోనే ఉంటుంది. జాతీయ సంస్థలు సీబీఐ, ఈడీని పూర్తిగా దుర్వినియోగం చేశారు’అని సిద్దరామయ్య విమర్శించారు. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాల్లో ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల విధానానే్న వాడుతున్నారని కాంగ్రెస్ నేత తెలిపారు. కాంగ్రెస్‌తోపాటు అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసినా ఈవీఎంలకే ఈసీ ఎందుకు మొగ్గుచూపుతోంది?అని ఆయన నిలదీశారు. ఈనెల 24న ఫలితాలు వెలువడుతున్నాయని, ప్రజా తీర్పు ఎలా ఉన్నా తమకు ఆమోదయోగ్యమేనని ఆయన పేర్కొన్నారు.

*చిత్రం... మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య