జాతీయ వార్తలు

ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలతో ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 22: ఇద్దరు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నాయకులకు కార్యకర్తలు చెప్పుల దండలు వేసి ఊరేగించారు. గత ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా టిక్కెట్ల కేటాయింపులో వారిరువురూ అవినీతికి పాల్పడ్డారని వారి ఆరోపణ. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఉన్న బీఎస్‌పీ నాయకుడు గౌతమ్‌ను చుట్టుముట్టి చెప్పుల దండ వేసి, ముఖానికి నల్లటి కాటుక పెట్టి గాడిదపై కూర్చోబెట్టి ఊరేగించారు. మరో నాయకుడు సీతారాంను కూడా ఇదే విధంగా ఊరేగించారు. ఐదేళ్ళుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన నాయకులను, చురుకైన కార్యకర్తలను పక్కన పెట్టి, చివరి నిమిషంలో అవినీతికి పాల్పడి ఈ విధంగా టిక్కెట్లు అమ్ముకున్నందుకే ఈ చర్యకు పాల్పడినట్లు కార్యకర్తలు తెలిపారు. ఇలాఉండగా బీఎస్‌పీ మాయవతి రాజస్థాన్ రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. మంగళవారం ఆమె హిందీలో ట్వీట్ చేస్తూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. భేరసారాలను కాంగ్రెస్సే ప్రోత్సహించిందని, ఇప్పుడు రాజస్థాన్‌లో తమ పార్టీ నాయకులపై ఈ ఘటన జరగడానికీ కాంగ్రెస్ కారణమని ఆమె దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ళను కాంగ్రెస్ ప్రారంభించిందని ఆమె విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్‌లో ఇద్దరు సీనియర్ నాయకులపై ఇలా అమానుషంగా ప్రవర్తించడం సిగ్గు చేటని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని మాయావతి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి ఆరుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నదని ఆమె విమర్శించారు.