జాతీయ వార్తలు

హర్యానాలో అధికారం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛండీగడ్, అక్టోబర్ 22: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని హర్యానా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి సెల్జా అన్నారు. బీజేపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని పలు సర్వేలు స్పష్టం చేసిన నేపథ్యంలో మాట్లాడిన ఆమె హర్యానాలో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని తాను చాలా నమ్మకంగా, ధీమాగా చెప్పగలుగుతున్నానని 90 స్థానాల అసెంబ్లీలో 45 సీట్లకు పైగా వస్తాయని అన్నారు. ఇంత ధీమాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారన్న ప్రశ్నకు ‘రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుంచి నాకు విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. ముఖ్యంగా బీజేపీ సాగించిన ఎన్నికల ప్రచార తీరు కూడా ఇందుకు దోహదం చేస్తుంది’ అని జవాబు ఇచ్చారు. అసలు హర్యానకు సంబంధించిన ఏ అంశాన్నీ బీజేపీ నాయకత్వం తమ ప్రచారంలో ప్రస్తావించలేదని అన్నారు. తమ వైఫల్యాలను పసిగట్టడం వల్లే హర్యానాకు సంబంధించిన అంశాలను బీజేపీ నేతలు ప్రస్తావించలేదని, ఈ విషయాన్ని, వాస్తవాన్ని ప్రజలు గమనించాలని సెల్జా తెలిపారు. నిరుద్యోగ సమస్య, ఆర్థిక మాంద్యం రైతుల దురవస్థలు, శాంతి-్భద్రతల వైఫల్యం వంటి స్థానిక అంశాలను ప్రస్తావించకుండా కేవలం జాతీయ అంశాల ప్రాతిపదికగానే బీజేపీ ప్రచారం చేసిందని తెలిపారు. బీజేపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందన్న సర్వే ఫలితాలను తాను విశ్వసించడం లేదని, ఇవన్నీ కూడా ఓటింగ్ జరగడానికి ముందే కొందరి అభిప్రాయాలు సేకరించి సాగించిన సర్వేలేనని ఆమె ఆన్నారు. బీజేపీ నాయకత్వం కాశ్మీర్‌కు సంబంధించిన 370-అధికరణ రద్దు ఇతరత్రా జాతీయ అంశాలనే ప్రస్తావించిందని, ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్న తన అభివృద్ధి పనుల పట్ల విశ్వాసం లేకపోవడం, రాష్ట్ర నాయకత్వాన్ని నమ్మలేక పోవడం వల్లే స్థానిక అంశాలను బీజేపీ నేతలు దాట వేశారన్నారు. ఈవీఎంల పని తీరుపై వస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆమె ‘నా ఓటు వేయడానికే మామూలు సమయం కంటే ఎక్కువ సమయమే పట్టింది’ అని అన్నారు. ఈవీఎంల పని తీరుపై తనకు అనుమానాలు ఉన్నాయన్న సెల్జా అధికార బీజేపీ అభ్యర్థి భక్షి సింగ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందని సెల్జా గుర్తు చేశారు. గతంలో కూడా ఈవీఎంల పని తీరుపై కాంగ్రెస్ నాయకత్వం సందేహాలు వ్యక్తం చేసిందని, ఎన్నికల కమిషన్‌ను కూడా ఆశ్రయించడం జరిగిందన్నారు. ప్రజలకు కూడా వీటిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్న ఆమె ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలకు ఆస్కారం ఉండకూడదన్నారు. మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానానే్న అమలు చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అని తెలిపారు.
*చిత్రం... హర్యానా కాంగ్రెస్ చీఫ్ సెల్జా