జాతీయ వార్తలు

ఆదాయానికి లోబడే ఖర్చులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్, అక్టోబర్ 23: జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఉన్నతాధికారులు వివిధ ఖర్చులపై దృష్టి పెట్టారు.
ఆదాయానికి లోబడే ఖర్చులు ఉండాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీవరకు గల కాలానికి ముందుగా అంచనా వేసి, వ్యయాని కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఖర్చు చేయడానికి వీల్లేదని రాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) అధికారులు మిగతా శాఖలకు ఉత్తర్వులు పంపారు. ఆర్థిక కమిషనర్ అర్జున్ కుమార్ మెహతా సంతకం చేసిన ఈ ఆదేశాల్లో ఖర్చులను తగ్గించుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఏమాత్రం లేదని పేర్కొన్నారు.
అంచనాల ప్రకారం 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 అక్టోబర్ 30వ తేదీ వరకు ఎంతెంత మొత్తాలను ఖర్చు చేయాలని ఉద్దేశించారో, ఆ అంచనాలకే కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. బడ్జెట్ పెరిగే అవకాశం ఏమాత్రం లేదని, కాబట్టి, వివిధ శాఖలు ఇబ్బందుల్లో పడకుండా ఉండడానికే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 అధికరణ రద్దు సమయంలోనే రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలని పార్లమెంటు తీర్మానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పరిస్థితి చక్కబడిన తర్వాత, ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈలోగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజా ఆదేశాలు ఈ చర్యలో భాగమే.