జాతీయ వార్తలు

దొంగ డాక్టర్లకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: నకిలీ సర్ట్ఫికెట్లతో ప్రాక్టీసు కొనసాగిస్తున్న దొంగ డాక్టర్లకు చెక్ పెట్టడానికి ముంబయి పోలీసులు నడుం బిగించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లోని ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సహాయాన్ని తీసుకుంటున్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, నకిలీ వైద్యులను గుర్తించినట్టు బీఎంసీ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. వీరిలో ఎక్కువమంది ఎలాంటి సర్ట్ఫికెట్లు లేకుండానే బినామీ వైద్యం చేస్తున్నట్టు గుర్తించామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. కాగా, ముంబయి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) షాజీ ఉమాప్ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చాలామంది నకిలీ డాక్టర్లు ఎక్కువగా మురికివాడల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెప్పారు. దేవనార్, గోవాంగ్, తిలక్‌నగర్, బాంద్రాతోపాటు పలు శివారు ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారని తెలిపారు. బుధవారం నాటి దాడుల్లో షంషీర్ షేక్ (38), అన్వర్ హుస్సేన్ (45), నరుూం షేక్ (40), నవాబ్ హుసేన్ (36), రిజ్వానుద్దీన్ (27), బింజారా (35)ను అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. వీరిపై భారత శిక్షాస్మృతి 420 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మహారాష్ట్ర మెడికల్ ప్రాక్టీషనర్ల చట్టం కింద కూడా వీరిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన వివరించారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే నకిలీ వైద్యులు అధిక సంఖ్యలో ఉన్నారని, భవిష్యత్తులో దాడులను కూడా కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.