జాతీయ వార్తలు

రబీ మద్దతు ధర పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.85 పెంచాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ బంకులతోపాటు విద్యుత్ చార్జింగ్ బంకులను ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని దాదాపు 70 అనధికార కాలనీలను రెగ్యులరైజ్ చేస్తారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంస్థలను విలీనం చేయడంతోపాటు దీన్ని పటిష్టం చేసేందుకు అదనపు పెట్టుబడులను అందజేస్తామని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. వేరుశనగ కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.255, కాయ ధాన్యాల ధరలను క్వింటాలుకు రూ.325, పొద్దు తిరుగుడు ధరను క్వింటాలుకు రూ.270 పెంచారు. ఆవాల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.225 పెంచారు.
భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వ సంస్థలతోపాటు ఇకమీదట ప్రైవేటు, విదేశీ సంస్థలు కూడా దేశంలో పెట్రోలు, డీజిల్, సీఎన్‌జీ తదితర గ్యాస్‌ను ప్రజలకు సరఫరా చేసేందుకు బంకులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని జావడేకర్ తెలిపారు. ఇంతవరకు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ గ్యాస్‌ను మార్కెటింగ్ చేసేందుకు వీలుండేది. ఇకమీదట ప్రైవేట్ సంస్థలు కూడా తమ బంకులు ఏర్పాటు చేసుకుని
పెట్రోలియం ఉత్పత్తులను పంపిణీ చేసేందుకు వీలు కల్పిస్తున్నామని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ విధానం గత 17 సంవత్సరాల నుంచి మారలేదు.. ఇప్పుడు మారుతున్న ఆర్థిక రంగం, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావడేకర్ వివరించారు. చమురు రంగంతో ప్రమేయం లేనివారు కూడా పెట్రోలియం ఉత్పత్తులను పంపిణీ చేసేందుకు ఇప్పుడు అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులతోపాటు విద్యుత్ చార్జింగ్ కూడా రంగంలోకి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కొత్త సంస్థలు ఈ రంగంలోకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్లోకి తెస్తాయని జావడేకర్ తెలిపారు.
ప్రభుత్వ రంగంలోని ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ సంస్థలను మూసివేసే ప్రసక్తే లేదు. ఈ రెండింటినీ విలీనం చేసి ఒక సమర్థ వ్యవస్థను తయారు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు జావడేకర్ తెలిపారు. ఈ రెండు సంస్థలు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వీటిని కొనసాగించాలన్నది తమ ప్రభుత్వం నిర్ణయమని ఆయన చెప్పారు. విలీనం అనంతరం సంస్థను సమర్థంగా నడిపించేందుకు అదనంగా 15వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని అన్నారు. దీనితోపాటు సిబ్బందికి అత్యంత ఆకర్షణీయమైన వీఆర్‌ఎస్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రైవేట్ టెలిఫోన్ సంస్థలతో పోలిస్తే ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థల్లో 70 శాతం మంది సిబ్బంది అదనంగా ఉన్నారని జావడేకర్ తెలిపారు. అదనపు సిబ్బందిని తొలగించకుండా వారికి వీఆర్‌ఎస్ పథకాన్ని అమలు చేస్తారని ఆయన వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జి సేవలను అత్యంత సమర్థంగా ప్రజలకు అందజేస్తుందన్నారు. ఢిల్లీలోని దాదాపు 70 అనధికార కాలనీల్లో ఉంటున్న దాదాపు నలభై లక్షల మంది ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ కాలనీలను రెగ్యులరైజ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని జావడేకర్ తెలిపారు.
*చిత్రం... మంత్రివర్గం నిర్ణయాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్