జాతీయ వార్తలు

అదో వృథా ప్రయాస పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పెద్దనోట్ల రద్దు ఓ నిరుపయోగ ప్రయత్నంగానే మిగిలిపోయిందని, దేశ ఆర్థిక పరిస్థితి గాడి తప్పడం తప్ప, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల లక్షలాది మంది జీవితాలు దుర్భరమైపోతాయని తాను తొలి రోజు నుంచే చెబుతూ వస్తున్నానని మమత గుర్తు చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రకటించిన మరుక్షణమే తాను ఈ హెచ్చరిక చేసినట్టుగా ఆమె తెలిపారు. తన అంచనానే నిజమైందని, అన్నివిధాలుగా దేశ ఆర్థిక పరిస్థితి, సామాన్యుడి స్థితిగతులు దెబ్బతిన్నాయన్న విషయాన్ని నిపుణులు అంగీకరించారని తెలిపారు. ఆర్బీఐ వెలువరించిన లెక్కలు కూడా పెద్దనోట్ల రద్దు వ్యర్థ నిర్ణయమన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయని అన్నారు. ఆ నిర్ణయం పుణ్యమాని బ్యాంకింగ్ వ్యవస్థ ఘోరంగా దెబ్బతిందని, ఆర్థిక పరిస్థితి కూడా మాంద్యం గుప్పిట చిక్కుకుందని పేర్కొన్న ఆమె రైతుల నుంచి యువత వరకు, కార్మికుల నుంచి వర్తకుల వరకు, ఉద్యోగుల నుంచి గృహిణుల వరకు ప్రతిఒక్కరి జీవితంపైనా పెద్దనోట్ల రద్దు తీవ్రమైన ప్రభావాన్ని కనబరించిందని అన్నారు.