జాతీయ వార్తలు

యాజమాన్య హక్కులపై త్వరలోనే చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశ రాజధాని నగరంలోని అనధికార కాలనీల్లో ఉంటున్న ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ పార్లమెంటులో ఓ చట్టాన్ని తీసుకువస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. బీజేపీ ఎంపీలు సహా 200 మందితో కూడిన ఢిల్లీ ప్రతినిధుల బృందంతో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఢిల్లీలో అనధికారికంగా ఉన్న 1797 కాలనీల్లో ఉంటున్న ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన ఓ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ గత నెలలో ఆమోదించిన నేపథ్యంలో ప్రధాని చేసిన ప్రకటనకు ప్రాధాన్యత చేకూరింది. ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలో ఉంటున్న దాదాపు 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. దీర్ఘకాలంగా ఈ యాజమాన్య హక్కుల కోసం ఈ కాలనీవాసులు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీలు, హక్కుల కార్యకర్తలు, ఈ కాలనీల వాసుల బృందం మోదీని కలుసుకున్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన చట్టాన్ని తీసుకువస్తామని మోదీ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆయన అన్నారు.
సాధికారత సంతృప్తినిచ్చింది
ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సాధికారతను కల్పించేందుకు తన హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రయత్నాలు తనకెంతో సంతృప్తిని కలిగించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కుల, మత, ప్రాంత, భాష, వయోపరిమితితో నిమిత్తం లేకుండా దేశ ప్రజలంతా గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని రీతిలో తమ ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని ఆయన అన్నారు. ఓ ప్రభుత్వం రెండోసారి కూడా తిరులేని మెజారిటీతో అధికారాన్ని అప్పగించడం ఇటీవల కాలంలో ఎన్నడూ జరగనిదేనని మోదీ తెలిపారు. ఇనె్వస్ట్‌మెంట్ మేనేజిమెంట్ సంస్థ బ్రిడ్జి వాటర్ అసోసియేట్ సంస్థాపకుడు రే డేలియో ట్వీట్‌కు ప్రతిస్పందనగా మోదీ ఈ విషయాన్ని తెలిపారు.