జాతీయ వార్తలు

పహారా నీడలో అయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, నవంబర్ 8: దశాబ్దాలుగా కొనసాగుతున్న బాబ్రీ మసీద్-అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు త్వరలోనే తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఇటు ఉత్తరప్రదేశ్ సర్కారు, అటు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. తీర్పుకు ముందుగానే అయోధ్య పూర్తిగా పహారా నీడకు చేరుకుంది. వివాదాస్పద స్థలం వైపు ఆందోళనకారులు ఎవరూ చేరుకోకుండా ఉండేందుకు అధికారులు బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. తీర్పు వెలువడకు ముందు, ఆతర్వాత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) పీవీ రామశాస్ర్తీ శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. మూడు అం చెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఆందోళనకుగానీ, ఘర్షణలకుగానీ తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
తీర్పు ఎప్పుడు వెలువడినా, దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరింప చేశారు. ఇప్పటికే అయోధ్య మొత్తం భద్రతా సిబ్బందితో నిండిపోయింది. రామజన్మస్థాన్ ప్రాంతానికి ఇతరులు ఎవరూ చేరుకోకుండా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు.