జాతీయ వార్తలు

కమ్ముకొన్న పొగమంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 8: కాశ్మీర్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రెండో రోజైన శుక్రవారం కూడా దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. జమ్మూ-శ్రీనగర్ హైవేపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎక్కడా దారి కనిపించకపోవడంతో శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు నిలిపివేశారు. పొగమంచు కారణంగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలోని గురెజ్, మచిల్, కెరన్, తంగ్‌దర్‌లలో పూర్తిగా ప్రతికూల వాతావరణం కనిపించింది.
‘పొగమంచు కమ్ముకొని దారి కనిపించని కారణంగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు జరగలేదు.. జవహర్ టనె్నల్‌కు ఇరువైపులా రవాణా స్తంభించింది.. వీలైనంత త్వరగా ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకొంటున్నాం’ అని జమ్మూ రవాణా శాఖ అధికారులు తెలియజేశారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. రన్‌వే కనిపిస్తున్నప్పటికీ.. పొగమంచు బాగా కమ్ముకోవడంతో దారి స్పష్టంగా కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు. పరిస్థితి అనుకూలంగా ఉంటే యథాతథంగా నిర్వహిస్తామని వివరించారు. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో గురువారం అత్యవసర సర్వీసులైన నీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. దారులు కనిపించకపోవడంతో ఎక్కడా జనం బయటకు వచ్చిన దాఖలాలు లేవు. శ్రీనగర్‌లో చాలా ప్రాంతాల్లో దుకాణాలు సైతం తెరుచుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాకు హాజరైన ఉద్యోగుల సంఖ్య కూడా బాగా తగ్గినట్లు సమాచారం.