జాతీయ వార్తలు

‘బుల్‌బుల్’ తుఫాన్‌ను ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా, నవంబర్ 9: బుల్‌బుల్ తుపాను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్నది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వయంగా తానే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని ఆమె శనివారం మీడియాతో మట్లాడుతూ చెప్పారు. అంతేకాకుండా ఎటువంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కొవడానికి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో బుల్‌బుల్ తుపాను ప్రవేశించినట్లు ఆమె చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఎవరూ భీతిల్లరాదని అన్నారు. శనివారం సాయంత్రానికి తుపాను పశ్చిమ బెంగాల్‌లోని మిగతా ప్రాంతాల్లోకి దూసుకెళ్ళే అవకాశం ఉందన్నారు. 24 గంటలూ తమ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఆమె తెలిపారు. ఏ ఒక్కరికీ హానీ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇందుకు జాతీయ విపత్తుల సహాయ పునరావాస కేంద్ర సిబ్బంది, రాష్ట్ర విపత్తుల సహాయ సిబ్బంది సహాకారాన్ని తీసుకోవడానికి వీలుగా వారి సహాయాన్ని తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే 1.2 లక్షల మంది ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆమె చెప్పారు. ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, తాము తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. బుల్‌బుల్ తుపాను కారణంగా 135 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్ళరాదని ఆమె కోరారు. అతి పురాతన కట్టడాల్లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.