జాతీయ వార్తలు

అంతటా రామ స్మరణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, నవంబర్ 10: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీంకోర్టు శాశ్వతంగా తెర దించిన నేపథ్యంలో అయోధ్య పుణ్యక్షేత్రంలో భక్తుల రాకపోకలు, ప్రజల దైనందిన కార్యకలాపాలు ఆదివారం ముమ్మరంగా సాగాయి.
భారీ భద్రత ఏర్పాట్ల మధ్యే అయోధ్య కొనసాగుతున్నప్పటికీ జనజీవన స్రవంతికి ఏరకంగానూ ఆటంకం కలుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హనుమాన్ ఘార్హీ, నయా ఘాట్ వంటివాటి సమీపంలోని ప్రాంతాలు ఆదివారం ఉదయం నుంచే జనసమ్మర్ధంగా మారాయి. శ్రీరాముడు, ఆంజనేయస్వామి ఆలయాలను సందర్శించిన భక్తులు ప్రార్థనలు జరిపారు. తెల్లవారుజాము నుంచే ఈ పట్టణం భజనలు, కీర్తనలతో మార్మోగింది. ఓ పక్క పోలీస్ పహారా, తనిఖీలు తీవ్రంగా కొనసాగినా కూడా జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలుగకపోవడం గమనార్హం. భక్తులు అందించిన నూతన వస్త్రాలతో శ్రీరాముడిని అలంకరించినట్టు రామ్ లల్లా ఆయల పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు. నగరమంతా కూడా అయోధ్య తీర్పునకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలతోనే నిండిపోయింది.
ఎక్కడికక్కడ ప్రజలు వాటి గురించి చర్చించుకోవడం స్పష్టంగా కనిపించింది. అలాగే, సుప్రీం తీర్పుపై అయోధ్య మాట ఎలా ఉన్నా ఇతర రాష్ట్రాల ప్రజలు ఏమనుకుంటున్నారన్న జిజ్ఞాస కూడా ఇక్కడి ప్రజల్లో కనిపించడం గమనార్హం. ‘ఆదివారం మాకు ప్రత్యేక రోజు. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారమైపోయిందన్న ఆనందంతో మా హృదయాలు ఉప్పొంగిపోయాయి’ అన్న మాటలే అందరి నోళ్లలోనూ వినిపించాయి. రాముడు, సీత విగ్రహాలు, ఫొటోలు, పూజా సామాగ్రి విక్రయాలు విస్తృతంగా సాగాయి. ముఖ్యంగా హనుమాన్ ఘార్హీ ఆలయ సమీపంలోని దుకాణాల్లో కూడా వ్యాపారం కంటే పత్రికల్లో వచ్చిన వార్తలపైనే వాటి యజమానులు దృష్టి పెట్టడం గమనార్హం. సుప్రీం తీర్పుతో అయోధ్య స్వరూపమే మారిపోయిందని అభినందనల వెల్లువ కొనసాగడంతో తెచ్చిన పూలమాలలన్నీ అమ్ముడైపోయాయని ఓ వర్తకుడు తెలిపాడు. పక్కనున్న వారణాసి, ఇతర పట్టణాల నుంచి వీటిని తీసుకురావాల్సి వచ్చిందని అనూప్ సైనీ అనే ఓ వర్తకుడు తెలిపాడు. సుప్రీం తీర్పుతో అయోధ్య ఇప్పడు సరైన మార్గంలోనే ముందుకు సాగుతుందని, రానున్న రోజుల్లో ఇక్కడ స్వర్ణయుగమే ఆవిష్కృతమవుతుందన్న అభిప్రాయంలో జనంలో వ్యక్తమవుతోంది.
*చిత్రం...అయోధ్యలోని రామజన్మభూమి న్యాస్ వద్ద గల హనుమాన్ ఘార్హీ మందిర్ ప్రధాన పూజారి మహంత్ రాజు దాస్‌తో స్థానిక ముస్లిం నాయకుడు బబ్లూ ఖాన్..