జాతీయ వార్తలు

చర్చలతో చక్రం తిప్పిన అజిత్ దోవల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు మేరుకు అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామాలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో హిందూ ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు జరుగకుండా చూసేందుకు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఇరుపక్షాల మత నాయకులతో మంతనాలు ప్రారంభించారు. హిందూ ముస్లిం తదితర మతాల నాయకులతో శని, ఆదివారాల్లో జరిగిన చర్చలు సత్ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అజిత్ దోవల్ శనివారం హిందూ ధర్మ ఆచార్య సభ అధ్యక్షుడు అవధేశానంద స్వామి నాయకత్వంలో పలువులు మత నాయకులతో సమావేశం జరిపి సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నెలకొన్న మతపరమైన పరిస్థితులపై సమీక్ష జరిపారు. అజిత్ దోవల్ ఆదివారం ప్రముఖ యోగాచార్యుడు, వ్యాపారవేత్త బాబా రామ్‌దేవ్, జమీయత్ ఉలేమా-ఏ-హింద్ ప్రధాన కార్యదర్శి వౌలానా ఎం మదానీ, హిందూ ఆచార్య సభ అధ్యక్షుడు అవధేశానంద గిరి మరికొందరితో సమావేశం జరిపారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి విజయం.. మరొకరి ఓటమి కాదని సమావేశం అభిప్రాయపడింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు కేటాయించి ముస్లింలు తమకు నచ్చినచోట మసీదు నిర్మించుకునేందుకు ఐదెకరాల భూమిని కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించటం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని చెప్పిన సున్నీ వక్ఫ్ బోర్డు నాయకులు, ఇతర ముస్లిం సంస్థల నాయకులు లోలోపల కొంత ఆగ్రహంతో ఉండటం తెలిసిందే. ఈ ఆగ్రహం రోడ్లమీదకి రాకుండా చూసేందుకు అజిత్ దోవల్ పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో మతపరమైన సామరస్యాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై దోవల్ వారితో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు ఒక మతం విజయం.. మరో మతం గెలుపుకాదు.. ఇది దేశం గెలుపు అని సమావేశానంతరం రామ్‌దేవ్ బాబా, అవధేశానంద గిరి చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును అన్ని వర్గాలు, మతాల వారు గౌరవించాలని అన్నారు.
*చిత్రాలు.. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సామరస్యాన్ని పరిరక్షించేందుకు వివిధ మత పెద్దలతో సమావేశం నిర్వహిస్తున్న జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్