జాతీయ వార్తలు

2017 మే నాటికి అన్ని గ్రామాలకూ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదరా, అక్టోబర్ 8: దేశవ్యాప్తంగా 2017 మే కల్లా అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూశ్ గోయల్ శనివారం వెల్లడించారు. వెయ్యి రోజుల్లోగా దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని ఎన్‌డి ఎ ప్రభుత్వం నిరుడు నిర్ణయించిందని, ఆ గడువు పూర్తయ్యే లోగా కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని గోయల్ తెలిపారు. ఇందుకు అనుకూలంగా బొగ్గు, సంప్రదాయేతర ఇంధన వనరులు, గనులకు సంబంధించి రాష్ట్రాలకు రుణాలను అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఇచ్చే దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.