జాతీయ వార్తలు

52 మందితో జార్ఖండ్ బీజేపీ జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ రాంచీ, నవంబర్ 10: భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుండగా, త్వరలో జరుగబోయే ఎన్నికల్లో రఘుబర్ దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించివేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆదివారం విడుదల చేసిన జాబితాలో ప్రధానంగా తొలి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారని, కొంతమంది మాత్రం ఇతర దశల్లో పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు చెందిన వారు ఉన్నారని ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్రంలో అయిదు దశల్లో పోలింగ్ జరుగనుంది. తొలి దశ పోలింగ్ నవంబర్ 30న, చివరి దశ పోలింగ్ డిసెంబర్ 23వ తేదీన జరుగుతుంది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషెడ్‌పూర్ (తూర్పు) నియోజకవర్గం నుంచి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా చక్రధర్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.