జాతీయ వార్తలు

ఆలయ నిర్మాణంలో ఆలస్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గాన్ని సుగమం చేసిన నేపథ్యంలో తక్షణమే నిర్మాణ చర్యలు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ ఆదివారం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిర్మాణ నిపుణుడు చంద్రకాంత్ సోంపురా రూపొందించిన డిజైన్ ప్రకారమే రామాలయ నిర్మాణం జరగాలని స్పష్టం చేసింది. 1989లో అప్పటి వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ అభ్యర్థన మేరకు ఈ ఆలయ డిజైన్‌ను సోంపురా రూపొందించారని ఈ సంస్థ తాత్కాలిక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. దాని ప్రకారమే ఆలయం ఉండాలని తాము ఆశిస్తున్నామని అన్నారు. ఆలయ నిర్మాణం కోసం రాళ్లను చెక్కడం, స్తంభాలను నిర్మించడం వంటి ప్రయత్నాలు ఇప్పటికే ఎన్నో జరిగాయని, వీటన్నింటినీ నిర్మాణంలో ఉపయోగించాలని ఆయన కోరారు. ఆదివారం ఇక్కడ జరిగిన వీహెచ్‌పీ కార్యనిర్వాహక సభ్యుల ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే, ఆలయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నిర్ణయించాలని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఒక ప్రకటనలో తెలిపారు.