జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా 90 మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/అయోధ్య, నవంబర్ 10: అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 90 మందిని అరెస్టు చేశారు. దాదాపు 8వేల మంది సామాజిక మీడియా పోస్టులకు సంబంధించి అధికారులు కేసులను నమోదు చేశారు. ఇటు అయోధ్యలోనూ దేశవ్యాప్తంగానూ ఆదివారం విస్తృత స్థాయి నిఘా కొనసాగింది. మరోపక్క హిందూ- ముస్లిం నేతలు మత సామరస్యాన్ని పాటించాలంటూ తమ వర్గాలు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలో పనిచేసిన రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యులకు భద్రతను మరింత పెంచారు. అదనపు దళాలను, బారికేడ్లను, సంచార సహాయ బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సామాజిక పోస్టుల ద్వారా శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించేందుకు ప్రయత్నించిన 40 మందిని ఆదివారం అరెస్టు చేశామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య 77కు పెరిగింది. అలాగే, ఈ రెండు రోజుల్లో 8,275 సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి చర్యలు తీసుకున్నామని, వీటిలో ఆదివారమే 4వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.