జాతీయ వార్తలు

సరయూకు కార్తీక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, నవంబర్ 11: శతాబ్ద కాలానికి పైగా సాగిన అయోధ్య వివాదానికి శాశ్వతంగా తెరదించుతూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన చారిత్రక తీర్పు తర్వాత వస్తున్న తొలి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది సరయూ నదిలో మంగళవారం పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉంది కాబట్టి భద్రతాపరంగా ఎలాంటి లోపం లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సుప్రీం తీర్పు తర్వాత ఇదే తొలి కార్తీక పౌర్ణమి కాబట్టి అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉండడంతో భద్రత, రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అంతటా అప్రమత్తత ప్రకటించారు. ప్రస్తుతం ఫజియాబాద్ పట్టణ సరిహద్దును ఆనుకుని ఉన్న అయోధ్య ద్వారం నుంచి ప్రధాన పట్టణానికి ఉన్న దాదాపు నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని మూసివేశారు. కేవలం యాత్రీకుల రాకపోకలు తప్ప, ప్రభుత్వ వాహనాలను ఈ మార్గంలో అనుమతించడం లేదు. ఏ వాహనాన్నైనా అయోధ్య ద్వారం వద్దే నిలిపివేస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులను మాత్రం పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే అయోధ్యవైపు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నాటి నుంచి ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని, మరో వారానికి పైగా ఇవి కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నిరకాలుగా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భక్తుల పుణ్యస్నానాల కోసం సరయూ నది ఒడ్డున అన్ని ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా రాంకీ పైడీ, నాయా ఘాట్, గుప్తార్ ఘాట్‌లలో నీరు సరిపడా ఉండడం వల్ల అక్కడే భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేశామని అయోధ్య డివిజన్ సమాచార డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్ సింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదున్నర నుంచి మంగళవారం సాయంత్రం 6.45 వరకు ఈ పుణ్యస్నానాలు జరిగే అవకాశం ఉంటుందని, లక్షలాదిగా జనం తరలివస్తారన్న అంచనాతోనే ఏర్పాట్లు చేశామని అన్నారు. అయితే, భక్తులు స్నానం చేసే ఘాట్లు రామ జన్మభూమి స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వివరించారు.
*సరయూ నది (ఫైల్ ఫొటో)