జాతీయ వార్తలు

కేంద్ర సర్వీసుల నుంచి నీలం సహానీ రిలీవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారిణి నీల సహానీని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో ప్రస్తుతం కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న నీలం సహానీని తిరిగి రాష్ట్రానికి కేంద్రం పంపించింది. నీలం సహానీని ఏపీ సీఎస్‌గా నియమిస్తారని తెలుస్తోంది.
ఆమెను పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం వుంది. నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారిణి. 2020 జూన్ 30న రిటైర్ కానున్నారు. ఉమ్మడి ఏపీలో పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశారు. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖతోపాటు పలు కీలకమైన శాఖల్లో నీలం సహానీ పని చేశారు. ఆమెను కేంద్రం కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఏపీ రిలీవ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గ సుగమమైంది.
*చిత్రం...సీనియర్ ఐఎఎస్ అధికారిణి సహానీ