జాతీయ వార్తలు

డమీ బుల్లెట్‌తో బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 8: కాశ్మీర్‌లోయలో అశాంతి ఇప్పట్లో తగ్గేట్లు కనిపించటం లేదు. శుక్రవారం సాయంత్రం జరిగిన అల్లర్లలో పోలీసులు డమీ బుల్లెట్ల (పెల్లెట్)తో జరిపిన కాల్పుల్లో గాయపడిన 12 సంవత్సరాల బాలుడు శనివారం మరణించటంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. జునైద్ అఖూన్ అనే పిల్లవాడి మరణంపై నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపించాలని అధికార పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ డిమాండ్ చేసింది. టెర్రరిస్టు బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత 85రోజులు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎలాంటి ఆందోళనలో పాల్గొనని బాలుడ్ని అన్యాయంగా చంపారంటూ స్థానికులు ఆరోపించారు. దీనికి సంబంధించిన బాధ్యులపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నౌహట్టా, ఖన్యార్, రైనావరి, సశాకాదల్, మహారాజ్, గూంజ్, మైసుమా, బాటమాలూ ప్రాంతాలలో కర్ఫ్యూ కొనసాగుతోంది.

చిత్రం.. బాలుడు అంత్యక్రియల సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన ఊరేగింపులో హింసాకాండ తలెత్తడంతో బాష్పవాయువును ప్రయోగిస్తున్న పోలీసులు