జాతీయ వార్తలు

పార్లమెంటరీ స్థారుూ సంఘం సభ్యుడిగా మన్మోహన్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడైన మన్మోహన్‌సింగ్‌ను పార్లమెంటరీ స్థారుూ సంఘం (ఫైనాన్స్)కు నామినేట్ చేస్తూ రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశాలు జారీ చేశారు. దిగ్విజయ్ సింగ్ స్థానంలో మన్మోహన్‌ను నియమిస్తూ వెంకయ్యనాయుడు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దిగ్విజయ్ సింగ్‌ను పార్లమెంటరీ స్థాయి సంఘం (పట్టణాభివృద్ధి)కు నామినేట్ చేసినట్లు రాజ్యసభ ఒక బులెటిన్‌లో తెలియజేసింది. ‘దిగ్విజయ్ సింగ్ స్థానంలో రాజ్యసభ సభ్యుడు మన్మోహన్‌ను పార్లమెంటరీ స్థారుూ సంఘం (ఫైనాన్స్)లో సభ్యుడిగా.. దిగ్విజయ్‌ను పట్టణాభివృద్ధికి సంబంధించిన స్థారుూ సంఘంలో నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశారు జారీ చేశారు’ అని బులెటిన్‌లో పేర్కొన్నారు. మాజీ ప్రధాని పార్లమెంట్‌లో స్థారుూ సంఘం (ఫైనాన్స్) సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు వీలుగా ముందుగానే దిగ్విజయ్ తన పదవికి రాజీనామా చేశారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. రాజ్యసభలో ప్యానెల్ సభ్యుడిగా 2014 సెప్టెంబర్ నుంచి 2019 మేనెల వరకు పనిచేశారు. ఈ సంవత్సరం జూన్ నెలతో మన్మోహన్ రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. అనంతరం రాజస్థాన్ నుంచి తిరిగి మన్మోహన్ రాజ్యసభ సభ్యుడిగా ఆగస్టు నెల నుంచి నియమితులయ్యారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక అంశాల్లో మన్మోహన్ నిర్వహించిన పాత్రను దృష్టిలో ఉంచుకొని ఈయన్ను పార్లమెంటరీ స్థారుూ సంఘం (ఫైనాన్స్) సభ్యుడిగా తిరిగి నియమిస్తూ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.