జాతీయ వార్తలు

అధికారుల చర్యలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాక్‌ద్వీప్, నవంబర్ 11: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ‘బుల్‌బుల్’ తుపాను తీవ్రను నుంచి రక్షించింది. అధికార యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల నష్టాన్ని తగ్గించగలిగారు. బుల్‌బుల్ తుపాను పరిస్థితిపై సీఎం మమతా బెనర్జీ సోమవారం సమీక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని మమత ప్రకటించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు యుద్ధ పాత్రిపదికన చేపట్టేందుకు ఓ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. సాగర్ ద్వీపమైన దక్షిణ 24 పరగణాలు, బంగ్లాదేశ్‌లోని ఖెపూపరలో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కనీసం పది మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందిపై ప్రభావం చూపింది. అధికారులు ముందుగానే అప్రమత్తమై 1.78 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 471 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏరియల్ సర్వే నిర్వహించారు. నామ్‌ఖానా, బఖాలీలో నష్టం వివరాలు తెలుసుకున్నారు. అధికారులతో సమీక్ష జరిపారు.
‘ప్రభుత్వం యంత్రాంగం ఎంతో కష్టపడి పనిచేసింది. నష్టాన్ని తగ్గిం చాం. విపత్తి నుంచి ప్రజలను కాపా డాం. మా అధికారుల పనితీరును కేంద్రం కూడా ప్రశంసించింది’అని ఆమె అన్నారు. కాగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హా నేతృత్వంలో టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి 48 గంటలకు ఓసారి సహాయ పనులను టాస్క్ఫోర్స్ పర్యవేక్షిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ కార్యకర్తల సహాయంతో పునరావాస పనులు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు.
*చిత్రం... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ