జాతీయ వార్తలు

షాతో నేడు తమిళనాడు బిజెపి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 8: కావేరి జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తమిళనాడు బిజెపి శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటును బిజెపి వ్యతిరేకిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ తమిళనాడు నేతలు అధినాయకత్వంలో సమావేశం కావాలని నిర్ణయించడం గమనార్హం. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రాష్ట్ర నాయకత్వం సమావేశమవుతోంది. ‘అమిత్ షాతో ఆదివారం సమావేశమవుతున్నాం. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, రాజ్యసభ సభ్యుడు ఎల్ గణేశన్‌తో కలిసి షాను కలుస్తాం’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ్‌సాయి సౌందరరాజన్ వెల్లడించారు. కావేరి యాజమాన్య బోర్డు అంశాన్ని తమ అధినేత దృష్టికి తీసుకెళ్లనున్నట్టు శనివారం ఆమె స్పష్టం చేశారు. తమిళనాడు రైతుల ప్రయోజనాల కోసం బిజెపి పోరాడుతోందని, ఇక ముందు అదే వైఖరిని అవలంబిస్తుందని ఆమె తెలిపారు. మరోపక్క కావేరీ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తోందంటూ తమిళ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పిఎంకె, తమిళ మనీలా కాంగ్రెస్ (మూపనార్) పార్టీలు శనివారం అరియాలూర్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తమిళనాడు రైతుల ప్రయోజనంకోసం కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అన్యాయం చేస్తోందని పిఎంకె అధినేత ఎస్ రాందాస్ విమర్శించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కావేరీ బోర్డు ఏర్పాటును కేంద్రం వ్యతిరేకిస్తోందని ఆయన ఆరోపించారు. తమిళనాడు పర్యటకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని పిఎంకె హెచ్చరించింది.