జాతీయ వార్తలు

ఆ భూమి నుంచే ఐదెకరాలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: అయోధ్యలో నిర్మించే రామమందిరం పరిసరాల్లోనే మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేయటం ద్వారా బాబ్రీ మసీదు వివాదాన్ని కొనసాగించేందుకు సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో సేకరించి పెట్టిన 67 ఎకరాల భూమి నుండి తమకు ఐదెకరాల భూమి కేటాయిస్తేనే మసీదు నిర్మాణం చేపడతాం.. లేకపోతే ప్రభుత్వం ఇచ్చే భూమిని తీసుకునే ప్రసక్తే లేదని సున్ని వక్ఫ్ బోర్డు నాయకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫ్రభుత్వం 1991లో వివాదాస్పద 2.7 ఎకరాలతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం 67 ఎకరాల భూమిని సేకరించి పెట్టుకున్నది. వివాదాస్పద భూమిని శ్రీరాముడికి కేటాయించిన సుప్రీం కోర్టు ముస్లింలు నచ్చినచోట మసీదు నిర్మించుకునేందుకు ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశించటం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించే ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా? అనే అంశంపై సున్నీ వక్ఫ్ బోర్డుతోపాటు ముస్లిం మత సంస్థలు, నాయకుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయోధ్యలో ముస్లింలు అధికంగా ఉన్నచోట ఐదెకరాల భూమిని తీసుకుని మంచి మసీదు నిర్మించుకోవాలని కొందరు ముస్లిం మత పెద్దలు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం నాయకులు తిరస్కరించారు. రామమందిర నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల నుండి తమకు ఐదెకరాలు కేటాయించవలసిందేనని సున్నీ వక్ఫ్ బోర్డు నాయకులు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల నుండి ఐదెకరాలను తమకు కేటాయించినప్పుడే తాము సంతృప్తి చెందుతామని బాబ్రీ మసీదు కేసులో ప్రధాన కక్షిదారుడు ఇక్బాల్ అన్సారీ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు కూడా గతంలో పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పింది కాబట్టి తమకు అక్కడే భూమి కేటాయించాలని ముస్లిం నాయకులు వాదిస్తున్నారు. అయోధ్యలో నిర్మించే రామమందిరం పరిసరాల్లో మసీదును నిర్మించటం వలన రెండు వర్గాల మధ్య గొడవలు ఇకమీదట కూడా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చేయటం ఎంతమాత్రం మంచిది కాదని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి చెబుతున్నారు. అయోధ్యలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ముస్లింలు అధిక జనాభాలో ఉన్నందున కొత్త మసీదును అక్కడ నిర్మించుకోవటం మంచిదని ఆయన స్పష్టం చేశారు. రామమందిరం పరిసరాల్లో ముస్లింల జనాభా అతితక్కువ అనేది మరిచిపోరాదు.. ముస్లిం జనాభా లేనిచోట మసీదు నిర్మించటం అంటే గొడవలకు తావివ్వడమేనని స్వామి చెప్పారు. అయితే ఇక్బాల్ అన్సారీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించటం లేదు. తమకు అనుకూలంగా ఉండేచోట భూమి కేటాయిస్తేనే తీసుకుంటాం.. లేకపోతే తీసుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి అవసరమ్యే భూమికోసం తాము ప్రభుత్వం మీద ఆధారపడలేదని వౌలానా జలాల్ అశ్రాఫ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే ముస్లిం మనోభావాలను అర్థం చేసుకుంటే 67 ఏకరాల నుండి తమకు ఐదెకరాలు ఇవ్వాలి.. 18వ శతాబ్దం సూఫీ మత గురువు ఖాజీ ఖుద్వాహ సమాధి ఉన్నచోట లేదా దాని పక్కన ఉన్న భూమిని కేటాయించాలి.. ఇదంతా 67 ఎకరాల్లోనే ఉన్నాయని అశ్రాఫ్‌తోపాటు అఖిల భారత ముస్లిం సమాఖ్య ప్రధాన కార్యదర్శి కలిఖ్ అహమద్ ఖాన్ చెప్పారు.