జాతీయ వార్తలు

నల్లమలలో యురేనియం అనే్వషణ ఆపాలి: డీవైఎఫ్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: నల్లమలలో యురేనియం అనే్వషణ, తవ్వకాలను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎంపీ, ఐద్వా జాతీయ అధ్యక్షులు సుభాషిణి అలీ, డివైఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ ముఖర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం డీవైఎఫ్‌ఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో నల్లమలలో యురేనియం సర్వే, తవ్వకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలు, మార్గదర్శకాలను కాలరాస్తూ యురేనియం, గనులు అంటూ పచ్చని అడవులను తవ్వి విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని ఆరోపించారు. ఐద్వా జాతీయ నాయకులు పుణ్యావతి, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్.అరుణ్‌కుమార్ ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ అవసరం లేకున్నా యురేనియం తవ్వుతూ తెలుగు ప్రజల జావితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఏపీ డివైఎప్‌ఐ అధ్యక్షులు ఎ.విజయ్‌కుమార్, ఎం.సూర్యారావు, నాయకులు సాంబశివ, రాము, అనగంటి వెంకటేష్, తిరుపతి పాల్గొన్నారు.