జాతీయ వార్తలు

ఎటు దారుంటే అటు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని స్థానంలో ఉన్నప్పటికీ మొదటి నుంచీ శివసేనది ఒంటెద్దు పోకడే. తనకు రాజకీయంగా, సైద్ధాంతికంగా విరోధమైన పార్టీలతో రాజకీయ చెలగాటం ఆడడమే ఆ పార్టీ ధోరణిగా కనిపిస్తోందన్నది తాజా పరిణామాలను బట్టి స్పష్టవౌతోంది. మహారాష్టల్రో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరువాతి స్థానం సంపాదించినప్పటికీ పదవులపై పట్టుబట్టి రాద్ధాంతం చేసింది. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలు సేనకు బెడిసికొట్టాయి. అందుకు కారణం మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలతో గతంలో దానికి ఉన్న సైద్ధాంతిక వైరమే రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బలపర్చడంతో పాటు ఆ పార్టీ నాయకురాలు శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సులేపై పోటీ చేయడం మొదలుకొని సైద్ధాంతికంగా ప్రతికూలమైన ముస్లిం లీగ్‌తో పొత్తు పెట్టుకోవడం వరకు మహారాష్టల్రో సేన రాజకీయాలు ఆ పార్టీ అస్పష్ట వైఖరికి అద్దం పడుతూనే వచ్చాయి. హిందుత్వ అజెండాతో రాష్ట్రంలో బలమైన పునాదులను సంతరించుకొన్న శివసేన మొదటి నుంచీ సన్నిహితంగా ఉన్న బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతును చూరగొనడానికి కారణం ఎలాగైనా అధికారాన్ని అందిపుచ్చుకోవాలన్న ప్రయత్నమే ఇప్పుడు బీజేపీకీ దూరం కావడం.. కాంగ్రెస్, ఎన్సీపీలు దగ్గరకు రానివ్వకపోవడం శివసేనలో నిరాశమయ పరిస్థితికి కారణమయ్యాయి. 1966లో బాల్‌థాకరే శివసేనను స్థాపించినప్పటి నుంచి చాలా వరకు అధికారికంగానో.. అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ వచ్చింది. కాంగ్రెస్ కూడా శివసేనతో కలిసిన సందర్భాలు బాగానే ఉన్నాయి. 1960, 1970 దశకాల్లో వామపక్షాలు, కార్మిక సంఘాలను ముంబయి నగరంలో తట్టుకోవడం కోసం శివసేనను కాంగ్రెస్ కూడా బాగానే వాడుకొందని ‘ది కజిన్స్ థాకరే-ఉద్ధవ్ అండ్ రాజ్ అండ్ ఇన్‌ది షాడో ఆఫ్ దెయిర్ సేన’లో రచయిత ధావర్ కులకర్ణి సుస్పష్టంగా పేర్కొన్నారు. ముంబయి, కొంకణ్ రీజియన్‌లలోని మూడు లోక్‌సభ స్థానాల్లో 1971లో కాంగ్రెస్ (వో) మద్దతుతో పోటీ చేసి ఓటమి పాలైంది. అనంతరం 1977 ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ ఎన్నికలో శివసేన తన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. ‘తిరిగి 1977లో జరిగిన మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది’ అని కులకర్ణి తన వ్యాసంలో పేర్కొన్నారు. ప్రముఖ రాజకీయ విశే్లషకుడు సుహాస్ పల్షికర్ ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో తన వ్యాసంలో ‘శివసేన మొట్టమొదటిసారిగా నిర్వహించిన ర్యాలీలో సైతం కాంగ్రెస్ నాయకుడు రామ్‌రావ్ ఆదిక్ పాల్గొన్నారు’ అని స్పష్టం చేశారు. 1978లో జనతాపార్టీతో కలిసి పోటీ చేసి ఓటమిని చవిచూసిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ)తో కలిసి 33 మంది అభ్యర్థులతో పోటీ చేసినప్పటికీ అప్పట్లో ఇందిరపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో అన్ని సీట్లను కోల్పోయిందని పల్షికర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. సైద్ధాంతికంగా వ్యతిరేకి అయిన ముస్లిం లీగ్‌తో కూడా కలిసి శివసేన పనిచేసిందన్నారు. 1970 దశకంలో గెలుపే లక్ష్యంగా ముస్లిం లీగ్‌తో చేతులు కలిపి మేయర్ ఎన్నికల్లో శివసేన పోటీ చేసినట్లు వెటరన్ జర్నలిస్టు ప్రకాష్ అకోల్‌కర్ ‘జై మహారాష్ట్ర’ పుస్తకంలో పేర్కొన్నారు. దీనికోసం ముస్లిం లీగ్ నాయకుడు జీఎం బనత్‌వాలాతో శివసేన వ్యవస్థాపకుడైన బాల్ థాకరే చర్చలు జరిపారు. ఇలా సైద్ధాంతికంగా వ్యతిరేకమైన ముస్లిం లీగ్‌తో ఒకసారి కాంగ్రెస్‌తో మరోసారి.. కొంతకాలం బీజేపీతో కూడా పనిచేసి స్పష్టమైన విధానం అంటూ ఏమీ పార్టీగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం పదవీ కాంక్షే ధ్యేయంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సైతం రాంరాం చెప్పి మహారాష్ట్ర రాజకీయాలు రాష్టప్రతి పాలన దిశగా వెళ్లేలా చేసి శివసేన అపవాదును మూటగట్టుకొంది.