తెలంగాణ

ఆ గురుద్వారాలను అందుబాటులోకి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తాన్‌పూర్, నవంబర్ 12: దేశ సరిహద్దు ఆవల ఉన్న చారిత్రక గురుద్వార్‌లను భారతీయ భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆకాంక్షించారు. పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ పంజా సాహిబ్, నాన్‌కనా సాహిబ్ తదితర గురుద్వారాల భారతీయ సిక్కులు సందర్శించేందుకు వీలుగా కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ‘ ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీతో నేను స్వయంగా మాట్లాడి అభ్యర్థిస్తాను. పాకిస్తాన్‌తో మాట్లాడి మార్గం సుగమం చేయాలని అడుగుతాను’అని అమరీందర్ సింగ్ వెల్లడించారు. సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్ 550 జయంతి కార్యక్రమాలు మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, పంజాబ్ గవర్నర్ వీపీఎస్ బాద్నోర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవ్ జయంతి కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. గురునానక్ దేవ్ బోధనలే అనుసరణీయమని అమరీందర్ అన్నారు.