జాతీయ వార్తలు

మా నిర్ణయం సరైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 13: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయరాదని తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్టు ఆధ్యక్షుడు జాఫర్ ఫారూఖీ స్పష్టం చేశారు. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణం కోసం కేటాయిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయంపై రివ్యూ పిటిషన్ వేయాలని ముస్లిం లా బోర్డు వాదిస్తుండగా, సున్నీ వక్ఫ్ బోర్డు మాత్రం ససేమిరా అంది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఫారూఖీ ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయరాదన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. ఈ వివాదం సమాజాన్ని రెండు వర్గాలుగా విభజించి వేసిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే, సమస్యను మరింత సుదీర్ఘకాలంపాటు పొడిగించకుండా ఉండాలని అనుకుంటున్నామని, ఆ కారణంతోనే రివ్యూ పిటిషన్ వేయరాదని తీర్మానించామని ఫారూఖీ వివరించారు. దీనిని ఒక వర్గానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుగా తాము భావించడం లేదని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో మొత్తం 67 ఎకరాలకు సంబంధించిన వివాదం ఉంది కాబట్టి, అంతే మొత్తంలో భూమిని కేటాయించాలని కొంతమంది ముస్లిం నేతలు చేస్తున్న డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఇది పూర్తి అసాధ్యమని, అసలు ఆ డిమాండ్‌కు విలువ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.