జాతీయ వార్తలు

ఆర్నెళ్ల సమయమిచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీ తొందరపడి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారంటూ కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీ, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను హోం శాఖ మంత్రి అమిత్ షా కొట్టివేశారు. ప్రతిపక్ష పార్టీలు గవర్నర్ పదవిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా బుధవారం ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్షాలకు బలం ఉంటే ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని అమిత్ షా సూచించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై గవర్నర్ బీజేపీకి ఎక్కువ సమయం ఇచ్చి.. ప్రతిపక్షాలకు తక్కువ సమయం ఇచ్చారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించటం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలకు ఆరు నెలల సమయం ఇచ్చారని అమిత్ షా చెప్పారు. గవర్నర్ తమకు సమయం ఇవ్వలేదనే ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ ఏకంగా ఆరు నెలల సమయం లభించినందుకు ప్రతిపక్షాలు సంతోషించాలన్నారు. శివసేన, ఎన్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన శాసనసభ్యుల బలాన్ని చూపించలేకపోయాయి కాబట్టే భగత్‌సింగ్ కొషియారీ రాష్ట్రపతి పాలన విధింపుకు సిఫారసు చేశారని ఆయన వివరించారు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీల వద్ద బలం ఉంటే వెంటనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా? అని అమిత్ షా వ్యంగ్య బాణాలు విసిరారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనీ, ప్రభుత్వంలో అన్నీ సగం, సగం అనే హామీని ఎప్పుడూ ఇవ్వలేదని అమిత్ షా ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిని శివసేనకు ఇవ్వడమనేది జరగదని అన్నారు. శివసేన ముఖ్యమంత్రి పదవి కోసమే ప్రతిపక్షాలతో చేతులు కలుపుతోందని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి ఓటు వేశారనేది మరిచిపోరాదని అన్నారు.
*చిత్రం...హోం శాఖ మంత్రి అమిత్ షా