జాతీయ వార్తలు

బీజేపీతోనే ఈ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన ఏర్పడడానికి బీజేపీ వైఖరే ప్రధాన కారణమని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఆ తర్వాత మరో మాట మాట్లాడుతూ ఒప్పందాలకు బీజేపీ గండి కొట్టిందని విమర్శించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లు సంపాదించిన విషయం తెలిసిందే. ఇదే కూటమికి చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌హెచ్‌ఎస్పీ)కి ఒక సీటు లభించింది. ప్రతిపక్ష కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీ తదితరులకు మొత్తం 104 సీట్లు లభించాయి. వీటిలో కాంగ్రెస్ బలం 44 కాగా, ఎన్సీపీకి 54 సీట్లు దక్కాయి. బీజేపీ-శివసేన కూటమి 162 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని సంపాదించింది. అయితే, ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం అధికారంలో సగ భాగం ఇవ్వడానికి బీజేపీ నిరాకరిస్తోందని, ప్రస్తుత గందరగోళ పరిస్థితికి అదే ప్రధాన కారణమని థాకరే పేర్కొన్నారు. నిజానికి ఇరు పార్టీలకూ కలపి ప్రజలు ఓట్లు వేశారని, కానీ బీజేపీ మాత్రం సొంత బలం ఉన్నట్టుగానే భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు తమకు ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే, బీజేపీ అందుకు సుముఖత వ్యక్తం చేయకుండా, చర్చలకు కూడా సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు.
బీజేపీ వైఖరి ఏమిటో తమకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మొండితనాన్ని మానుకుని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని బీజేపీకి ఆయన హితవు పలికారు.
*చిత్రం... శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే