జాతీయ వార్తలు

బిజీగా ఉన్నా.. ఇప్పుడేం మాట్లాడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 14: రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై స్పందించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించారు. సుప్రీం తీర్పు వెలువడి ఆరు రోజులైనా మీ స్పందన తెలుపలేదని విలేఖరుల అడిగిన ప్రశ్నకు గురువారం ఆమె సమాధానం ఇస్తూ బుల్‌బుల్ తుపాను విలయంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనీ.. సహాయ చర్యల్లో తాను నిమగ్నమై ఉన్నందున ఈ అంశంపై ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని చెప్పారు. సీఎం మమతా బెనర్జీ కాకుండా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ సుప్రీంకోర్టు నిర్ణయం మాట్లాడేందుకు నిరాకరించడం విశేషం. పరిపాలనా పరమైన సమీక్షలో ఉన్న తాను సుప్రీం తీర్పుపై ఎలాంటి సమాధానం ఇవ్వగలనని ప్రశ్నించారు. అధికారులతో సమీక్ష అనంతరం సీఎం మమత విలేఖరులతో మాట్లాడుతూ బుల్‌బుల్ తుపాను కారణంగా ఆరు లక్షల మంది ప్రజలు నష్టపోయారనీ.. దాదాపు ఐదు లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. మత్స్యకారులు సహా 14మంది తుపాను విలయానికి మృత్యువాత పడ్డారని వివరించారు. ఇదిలా ఉండగా, టీఎంసీ నేతలు మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు సుప్రీం తీర్పుపై మేం ‘ఒక్క మాట కూడా మాట్లాడలేం’ అని చెప్పడం విశేషం. పైగా అవసరమని భావించినప్పుడు మా ముఖ్యమంత్రి మమతే దీనిపై మాట్లాడతారని పేర్కొన్నారు.