జాతీయ వార్తలు

రాజకీయ నాయకత్వ శూన్యత నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 14: తమిళనాడులో సినీనటుడు కమల్‌హాసన్‌కు ముఖ్యమంత్రి పళనిస్వామికి మధ్య రాజకీయ యుద్ధం వేడెక్కుతోంది. అసలు కమల్‌హాసన్‌కు రాజకీయాల గురించి ప్రాథమిక జ్ఞానమే లేదని పణళిస్వామి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఆయన గురువారం మరింతగా రెచ్చిపోయారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందంటూ ఇటీవల రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఎంతైనా నిజమని.. గతంలో ఉన్నట్టుగా సమర్థులైన నాయకులే ప్రస్తుతం లేరని కమల్‌హాసన్ అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో నాయకత్వ శూన్యత స్పష్టంగా కనిపిస్తోందని.. సమర్థులు ఎవరూ లేరని ఆయన అన్నారు. జయలలిత, కరుణానిధి మరణించిన సమయంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఎంతైనా వాస్తవమని కమల్ తెలిపారు. అప్పట్లో రజనీపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ కేవలం ఓ నటుడేనని.. రాజకీయ నాయకుడు కాదని అన్నాడీఎంకే అంటే.. స్టాలిన్ రాకతో రాజకీయ నాయకత్వ శూన్యత తొలగిపోయిందని డీఎంకే వ్యాఖ్యానించింది. కాగా తన రాజకీయ ప్రయత్నం విఫలం కావడం ఖాయమంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి చేసిన వ్యాఖ్యలను కమల్‌హాసన్ ఖండించారు. ఆయన తన రాజకీయ ఆకాంక్షనే వ్యక్తం చేశారు తప్ప వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదని అన్నారు.