జాతీయ వార్తలు

రాహుల్ క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడిందంటూ తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణల చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై పునఃవిచారం జరపాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇలా ఉండగా చోకీదార్ చోర్ హై అంటూ నరేంద్ర మోదీపై ఆరోపణలు చేసి రాహుల్‌పై మీనాక్షి లేఖి వేసిన పరువునష్టం దావా కేసులో సుప్రీం కోర్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిని శిక్షించకుండా వదిలి వేస్తూనే ఆయన ‘ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి’అంటూ చురకవేసింది. సుప్రీం కోర్టు ఈ రెండు తీర్పులు ఇచ్చిన అనంతరం రవిశంకర్ ప్రసాద్ గురువారం నాడు బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్, రాహుల్ గాంధీ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సిగ్గు చేటంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాఫెల్ ఆరోపణలు, చౌకీదార్ చోర్ అంటూ ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తన తప్పుడు ఆరోపణలకు బాధ్యత వహించాలని మంత్రి అన్నారు. ‘రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారు. నరేంద్ర మోదీని దొంగ అంటూ విమర్శించిన రాహుల్ చౌకీదార్ చోర్ హై వివాదంలో సుప్రీం కోర్టును ఇరికించారు. సుప్రీం కోర్టు వాఖ్యలను వక్రీకంచారు’అని రవిశంకర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. ఫ్రాన్స్ మాజీ ప్రధాన మంత్రి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో చేసిన వ్యాఖ్యల విషయంలో అబద్ధాలు చెప్పారని ఆయన దుయ్యబట్టారు. జీపుల కొనుగోలు కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం, జలాంతర్గాములు, అగస్టా హెలీకాప్టర్ల కుంభకోణం లాంటి పలు కుంభకోణాలకు పాల్పడిన వారు నరేంద్ర మోదీ, ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సిగ్గు చేటన్నారు. కాగా కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టులో తప్పుడు కేసులు వేశారని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. అవినీతిలో మునిగితేలే వారు సుప్రీం కోర్టులో కేసులు వేయటం ఏమిటన్నారు. సుప్రీం కోర్టు 2018 డిసెంబర్ 24 తేదీనాడు రాఫెల్ కేసులో తీర్పు ఇస్తూ కొందరు వ్యక్తుల అభిప్రాయాలు ఆధారంగా విమానాల కొనుగోలుపై విచారణకు ఆదేశించటం కోర్టుకు సాధ్యం కాదంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని రవిశంకర్ ప్రసాద్ ఉటంకించారు. సుప్రీం కోర్టు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అన్ని అంశాలను లోతుగా పరీశీలించి అన్నీ సక్రమంగా జరిగాయని తీర్పు ఇవ్వటం గమనార్హమని ఆయన చెప్పారు. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా తిప్పికొట్టటంతోపాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవసరమైనంత పటిష్టమైన సైన్యం, సామర్థ్యం కలిగి ఉండటం దేశానికి ఎంతో అవసరమంటూ సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సైనిక దళాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధ వ్యవస్థను ఏర్పాటు చేయటం దేశానికి ఎంతో అవసరమంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం అర్థం చేసుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు. దేశ సమగ్రత, భద్రత కోసం సైన్యానికి ఆధునిక ఆయుధాలు అందటం చాలా ముఖ్యం అందుకే రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశామని ఆయన చెప్పారు. కాం గ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.