జాతీయ వార్తలు

తెరుచుకున్న శబరిమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల (కేరళ), నవంబర్ 16: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ దీక్షబూనిన భక్తుల నినాదాల మధ్య ఆలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరారు ఆలయ ద్వారాన్ని తెరిచి, అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం కొత్త పూజారులు ఎకే సుధీర్ నంబూద్రి (శబరిమల), ఎంఎస్ పరమేశ్వరన్ నంబూద్రి (మల్లికాపురం) గర్బగుడిని తెరిచారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 10 మంది మహిళలను పోలీసులు పంబ ప్రాంతంలోనే అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ సమయంలో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. అయినా పోలీసులు ససేమిరా అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకే తాము అనుమతించడం లేదని పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించారు. విజయవాడ నుంచి పంబకు చేరుకున్న 30 మంది బృందంలో 10 మంది మహిళలు 10 నుంచి 50 ఏళ్ళలోపు వారే ఉన్నందున పోలీసులు వారిని అనుమతించలేదు. వారి గుర్తింపు కార్డుల్లో ఉన్న వయస్సును దృష్టిలో పెట్టుకుని పోలీసులు వారిని పంబ దాటి ముందుకు వెళ్ళేందుకు అనుమతించలేదు. చేసేది లేక వారు వెనుదిరిగారు. దీక్షబూనిన అయ్యప్ప భక్తులు వందల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. ఇలావుండగా అయోధ్యలో వివాదస్పద కట్టడం, 2.77 ఎకరాల స్థలం విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శబరిమలలో అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలోనూ ధర్మాసనం తీర్పుకోసం అందరూ ఎదురు చూశారు. అయితే ధర్మాసనం ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ప్రచారం కోసం రావద్దు: మంత్రి
2018లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. 2018 సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ
తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును కేరళ ప్రభుత్వం అమలుకు సంసిద్ధం కాగా, అప్పట్లో బీజేపీ-ఎల్‌డీఎఫ్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 10 వేల మంది పోలీసులను బందోబస్తుకు నియమించింది. ఇలాఉండగా కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ కేవలం మీడియా ప్రచారం కోసం ఇక్కడికి రాకూడదని మహిళలనుద్ధేశించి అన్నారు. ప్రచారానికి ఇది వేదిక కాదన్నారు. దేవాలయంలోకి వెళ్ళాలనుకునే వారు కోర్టు ఉత్తర్వులతో రావాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం బోర్డు అన్ని చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.

*చిత్రం... ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ దీక్షబూనిన భక్తుల నినాదాలతో మార్మోగిన ఆలయం