జాతీయ వార్తలు

ఏకాభిప్రాయంతోనే జమిలి ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్: లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శనివారంనాడు ఇక్కడ వెల్లడించారు. రాజకీయ పార్టీలన్నీ కూర్చుని చర్చించి ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చి, చట్టంలో తదనుగుణమైన సవరణలు చేస్తే తప్ప ఒకే దేశం, ఒకే ఎన్నిక అమలయ్యే అవకాశం ఉండదని ఆయన వివరించారు. జమిలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనే తనంత తానుగా వ్యవహరించే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సూత్రప్రాయంగా ఏకకాల ఎన్నికలకు తాము అంగీకరించినా రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చి, సంబంధిత చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇది జరిగితే తప్ప, ఏకకాల ఎన్నికల ప్రక్రియపై తాము ముందుకు వెళ్లే అవకాశం ఉండదని అరోరా అన్నారు. ఈ తతంగం పూర్తయ్యేవరకు జమిలి ఎన్నికల ప్రతిపాదన సెమినార్లలో మాట్లాడుకోవడానికి పనికొస్తుందే తప్ప సమీప భవిష్యత్తులో అమలయ్యే అవకాశం ఉండదని అన్నారు. ఇక్కడి నిర్మా యూనివర్సిటీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అరోరా ప్రస్తావించారు. 1967 ముందు వరకు దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవని, అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం వల్ల ఈ సమతూకం దెబ్బతిందని అరోరా వివరించారు. దీనికి ఇతరత్రా అనేక కారణాలు కూడా దోహదం చేశాయని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేసే అవకాశమే ఉండదని, కొందరు వ్యక్తులు వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ట్యాంపరింగ్ అన్నది సాధ్యం కాదని ఆయన ఉద్ఘాటించారు. ‘్భరతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా మాట్లాడుతున్నాను. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను లేదా ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశమే ఉండదు. అయితే, సాంకేతికంగా కొన్ని సమస్యలు ఈ యంత్రాల్లో తలెత్తడం సహజం. ఈ రకమైన సాంకేతిక సమస్య మీరు ఉపయోగించే కార్లకు, ద్విచక్ర వాహనాలకూ వస్తుంది’ అని అరోరా పేర్కొన్నారు. ఈ సాంకేతిక సమస్య తలెత్తినంత మాత్రాన ఈవీఎంలలో జరిగే ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పడం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు సమర్ధమైన రీతిలో కృషి చేస్తున్నా వాటి నిజాయితీ పట్లే అనుమానాలు వ్యక్తం చేయడం, ఈ దిశగా కృషి చేసిన ప్రముఖ శాస్తవ్రేత్తలకు తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తోందని అన్నారు. ఈవీఎంల గురించి ఎప్పుడు అనుమానాస్పదంగా మాట్లాడినా వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తం చేసినా వాటిలో ఎలాంటి సహేతుకత లేదన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించిన ఆయన వీటిని ట్యాంపర్ చేయడం సాధ్యం కాదన్న విషయం ఆ ఎన్నికల ఫలితాలను బట్టి స్పష్టమైందని ఆయన ఉద్ఘాటించారు. ఇటీవల కాలంలో అన్ని రంగాల ప్రజల్లోనూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్న స్పృహ పెరిగిందని, ముఖ్యంగా సమాజంలోని ఎగువ వర్ణాల కంటే కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలే ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంతో చైతన్యం కనబరుస్తున్నారని అరోరా తెలిపారు.
*చిత్రం...అహమ్మదాబాద్‌లో శనివారం జరిగిన న్యాయ శాస్త్ర సదస్సులో మాట్లాడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా