జాతీయ వార్తలు

పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. చట్టసభల్లో సాంకేతికతపై అసోం శాసనసభ స్పీకర్ అధ్యక్షతన సభాపతుల సబ్‌కమిటీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రాభవన్‌లో స్పీకర్ మాట్లాడుతూ ఒక పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి పార్టీలో చేరాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పారని, దానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు నచ్చితే పార్టీలో ఎవరైనా చేరవచ్చునని ఆయన పేర్కొన్నారు.

*చిత్రం... స్పీకర్ తమ్మినేని సీతారాం