జాతీయ వార్తలు

ఎక్కడికక్కడే అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: హాస్టల్ ఫీజులను నిరసిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ) విద్యార్థులు చేపట్టిన చలో పార్లమెంట్ ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. రాజధానిలోని వివిధ మార్గాల ద్వారా పార్లమెంట్ భవన్‌కు బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్క ఆపేశారు. విద్యార్థులపై భాష్పవాయువుప్రయోగించారు. విచ్చలవిడిగా జరిపిన లాఠీ చార్జీలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. పలువుర్ని అరెస్టు చేశారు. జేఎన్‌యూ విద్యార్థుల ‘పార్లమెంట్ మార్చ్)కు వేలాది మంది తరలివచ్చారు. హాస్టల్ ఫీజులు ఉపసంహరించుకోవాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు చేపట్టిన మార్చ్ తీవ్ర రూపం దాల్చింది. ప్లకార్డులు చేపట్టిన జేఎన్‌యూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. పెంచిన ఫీజులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ మార్చ్‌ను దృష్టిలో పెట్టుకుని వందలాది మంది పోలీసులను మోహరింపచేశారు. దక్షిణ ఢిల్లీ, అలాగే పలు ప్రాంతాల్లో విద్యార్థులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గుంపులను చెదరగొట్టడానికి భాష్పవాయువుప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. బాబా గంగానాథ్ మార్గ్ వద్ద సుమారు 600 మంది విద్యార్థులను ఆపేశారు. అలాగే పలువురు విద్యార్థి నాయకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేఎన్‌యూను దిగ్బంధనం చేశారు. అన్ని గేట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల కళ్లుగప్పి లోధీ రోడ్ సమీపంలోని సఫ్దర్‌జంగ్ సమాధి వద్దకు విద్యార్థులు దూసుకొచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను నిలిపివేశారు. విద్యార్థులను సముదాయించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించారు. పోలీసులు దమనకాండకు దిగారంటూ ట్విట్టర్ వేదికగా విద్యార్థులు మండిపడ్డారు. గాయపడ్డ విద్యార్థులు, అరెస్టులను వారు ట్వీట్ చేశారు. జేఎన్‌యూ వద్ద ఎమర్జెని పరిస్థితి కల్పించారని సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా పార్లమెంట్ సమీపంలోని మూడు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్‌చౌక్ స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆపలేదు. నెల్సన్‌మండేలా మార్గ్, అరబిందో మార్క్, బాబా గంగానాథ్ మార్గ్ సహా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యార్థుల నినాదాలతో వీధులన్నీ ప్రతిధ్వనించాయి. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇలా ఉండగా జేఎన్‌యూలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై క్యాంపలో విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. విద్యార్థులు అలాగే వర్శిటీ పరిపాలనా యంత్రంగంతో కమిటీ చర్చలు జరిపి తక్షణం నివేదిక ఇవ్వాలని హెచ్‌ఆర్‌డీ ఆదేశించింది. జేఎన్‌యూ సక్రమంగా నడిచేందుకు అవసరమైన సహకారం అందించడానికి యూజీసీ ముందుకొచ్చింది. అయితే త్రిసభ్య కమిటీ ఏర్పాటుపై విద్యార్థి సంఘానికి ఎలాంటి సమాచారం లేదని అక్షాత్ అనే విద్యార్థి వెల్లడించాడు. ఇవన్నీ కంటితుడుపుచర్యలేనని మానవ వనరుల మంత్రిత్వశాఖపై మండిపడ్డారు. ‘విద్య మా జన్మహక్కు. మా కుటుంబ నుంచి జేఎన్‌యూకి వచ్చిన మొదటి వ్యక్తిని నేను. కమిటీల ఏర్పాటు కంటితుపుడు చర్యే. అధికారుల తీరు ఆక్షేపణనీయం. నా వంటి అందరు విద్యార్థులదీ అదే అభిప్రాయం’అని ప్రియాంక అనే విద్యార్థిని వ్యాఖ్యానించింది. మార్చ్‌కు బయలుదేరిన విద్యార్థులు ‘సేవ్ పబ్లిక్ ఎడ్యుకేషన్’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. పెంచిన ఫీజులు తగ్గించాలి, హాస్టల్‌లో ఫీజులు అందుబాటులో ఉంచాలని నినాదా లు చేశారు. ‘మా వీసీ(వైస్ చాన్సలర్)ని చూసి ఎన్నాళ్లయిందో. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరు. కనీసం ఇప్పుడైనా బయటకు వచ్చి చర్చ లు జరపాలి’అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ విద్యార్థి డిమాండ్ చేశారు. వర్శిటీలో నెలకొన్న పరిస్థితులపై జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ (జేఎన్‌యూటీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది మోదీ మార్కు ఎమర్జెన్సీ
జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేస్తుంటే అణచివేతకు దిగడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.‘మోదీ మార్కు ఎమర్జెన్సీ నడుస్తోంది. హాస్టల్ ఫీజులు తగ్గించమని అడిగితే వేలాది మంది పోలీసులను మోహరిస్తారా?. ఇదేమి ప్రజాస్వామ్యం’అని ఏచూరి మండిపడ్డారు. ప్రజాస్వామ్య ఉద్యమాలను అదుపుచేయడానికి అనుసరించాల్సిన విధానం ఇదికాదని సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థులను రెచ్చగొడుతోందని ఏచూరి ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఏచూరి జేఎన్‌యూ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజల హక్కని ఆయన స్పష్టం చేశారు.
*చిత్రం... సోమవారం ఢిల్లీలో పార్లమెంటు దిశగా దూసుకొస్తున్న జేఎన్‌యూ విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు