జాతీయ వార్తలు

ప్రత్యర్థులపై కక్ష సాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: పార్లమెంటు 17వ లోక్‌సభ రెండో సమావేశం మొదటి రోజు దాదాపు వంద మంది ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి పెద్దఎత్తున గొందరగోళం సృష్టించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందంటూ బీజేపీ కొత్త ప్రత్యర్థి శివసేన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టముట్టి పెద్దఎత్తున గొడవ చేశారు. మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది.. తప్పుడు కేసులతో అరెస్టులు చేసి జైళ్లలో పెడుతోంది.. సీనియర్ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా లాంటి నాయకులు పార్లమెంటుకు రాకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపించారు. ఫరూక్ అబ్దుల్లాను వెంటనే విడుదల చేసి లోక్‌సభకు తీసుకురావాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో కొందరు కాంగ్రెస్ సభ్యులు లేచి తమ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం లోక్‌సభకు హాజరయ్యేందుకు వీలు
కల్పించాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ విధానం ఎంతోకాలం సాగదంటూ వారు సభ దద్దరిల్లేలా నినాదాలిచ్చారు. జమ్ముకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఐరోపా ఎంపీలను కాశ్మీర్‌కు తీసుకుపోతారు కానీ తమను మాత్రం అక్కడికి వెళ్లనీయటం లేదని వారు దుయ్యబట్టారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపును వెంటనే నిలిపివేయాలంటూ ప్రతిపక్షం సభ్యులు సభ దద్దరిల్లేలా నినాదాలిచ్చారు. ప్రతిపక్షం సభ్యులు ప్రశ్నోత్తరాల సమయమంతా అంటే.. గంట పాటు పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అయితే లోక్‌సభ స్పీకర్ మాత్రం ప్రతిపక్ష సభ్యుల గొడవ, గందరగోళం మధ్యనే ప్రశ్తోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పలు ప్రశ్నలపై చర్చ జరిపారు. ప్రతిపక్షం సభ్యులు ప్రస్తావిస్తున్న అంశాల గురించి జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చారు. ప్రతిపక్షం మాత్రం పట్టించుకోకుండా నినాదాలు కొనసాగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకుని సభ సజావుగా నడిచేందుకు ప్రతిపక్షం సహకరించాలని కోరుతూ చేతులెత్తి నమస్కారం చేశారు. ప్రతిపక్షం మాత్రం పట్టించుకోకుండా గంటపాటు సభను స్తంభింపజేసేందుకు ప్రయత్నించింది.

*చిత్రం... లోక్‌సభలో సోమవారం స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలిస్తున్న ప్రతిపక్ష సభ్యులు