జాతీయ వార్తలు

మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పించే విషయమై ‘నీతి ఆయోగ్’ మేధోమథనం చేస్తున్నది.
ఎటువంటి ప్రజా ఆరోగ్య సంక్షరక్షణ విధానం పరిథిలోకి రాని మధ్య తరగతి కుటుంబీకులకు ఆరోగ్య సంరక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆరంభించిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకంతో దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వారిలో 40 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుంది. నవ భారత నిర్మాణంలో అందరికీ ఆరోగ్యం అనేది ముఖ్యమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను సోమవారం నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ ఆవిష్కరించారు. తమ లక్ష్యం అందరికీ ఆరోగ్యం కల్పించడమేనని రాజీవ్ కుమార్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచన చేస్తున్నదని ఆయన వివరించారు. ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. బిల్-మిలింద గేట్స్ పౌండేషన్ కో-చైర్మన్ బిల్ గేట్స్, నీతి ఆయోగ్ సలహాదారు (ఆరోగ్యం) అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.