జాతీయ వార్తలు

తెలుగు అకాడమీని విభజించండి: వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబరు 18:విభజన చట్టంలో 10 షెడ్యూల్ ఉన్న తెలుగు అకాడమీని విభజించాలని వైఎస్సార్ సీపీ సభ్యుడు రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో రఘురామకృష్ణంరాజు ఈ అంశాన్ని లేవనెత్తారు. తెలుగు భాష అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు అకాడమీని 1968లో అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావుఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగినా తెలుగు అకాడమీని అలాగే ఉంచేశారని వివరించారు. ఇప్పటి వరకు తెలుగు అకాడమీ విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుకు చర్యలు చేపట్టలేదన్నారు. కేంద్ర మంత్రి చొరవ తీసుకుని తెలుగు అకాడమీని విభజించాలని కోరారు. అలాగే 58: 42 నిష్పత్తిలో తెలుగు అకాడమీ నిధులను విభజన జరపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. నిధులను పంచడం ద్వారా సాంస్కృతిక వారసత్య భాష అయిన తెలుగును అభివృద్ధి చేసుకుంటామని వెల్లడించారు.