జాతీయ వార్తలు

మీడియాను నియంత్రించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: ప్రజాస్వామ్య దేశంలో మీడియాను నియంత్రించడం సరికాదని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. లోక్‌సభలో జీరో అవర్‌లో జయ్‌దేవ్ ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెం.2430 అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునెలా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కట్టబెడుతూ వైసీపీ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ శాఖలకు, అధికారులకు మీడియాను నియంత్రించే విధంగా అధికారులు ఇస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అలాగే టివీ ఫైవ్, ఏబీఎన్ చానళ్లపై అనధికారికంగా నిషేధం విధించారని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మీడియా సంస్థలపై కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకునెలా జారీచేసిన జీవో వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని కేంద్రానికి గల్లా జయ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు.