జాతీయ వార్తలు

వ్యవసాయ గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సరైన గణాంక సమాచారం, వినూత్న ప్రక్రియల ద్వారా పర్యావరణ మార్పుల వల్ల కలిగే వ్యవసాయ నష్టాన్ని తగ్గించుకోవచ్చని మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో చిన్న కమతాల వ్యవసాయదారులపై పర్యావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని బిల్‌గేట్స్ హెచ్చరించారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పాత్రను పెంపొందించాలని తద్వారా వ్యవసాయ దిగుబడులను ఇనుమడింపజేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ గణాంకాలపై 8వ అంతర్జాతీయ సదస్సు సోమవారం జరిగింది. ఈ సదస్సులో బిల్ గేట్స్ ప్రధానోపన్యాసం చేస్తూ భారత్‌లోని భూమి సారవంతమైందన్నారు. మంచి భూమి, మంచి సమాచారం, మంచి గణాంక వివరాలు ఉన్నట్లయితే వాతావరణ మార్పులు జరిగినా పంటల నష్ట నివారణను అడ్డుకోవడానికి వీలుంటుందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పాత్రను పెంపొందిస్తే, వ్యవసాయ దిగుబడులు పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని, ఇంకా వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్ట నివారణను అధిగమించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన వివరించారు. వాతావరణ మార్పులు సంభవించినప్పుడు ఎక్కువగా చిన్న రైతులు దెబ్బతింటున్నారని ఆయన అన్నారు. దీంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కరవు లేదా ఒక్క వరద వస్తే చాలు వారి పంటలు దెబ్బతిని ఆ కుటుంబాలు కోలుకోలేని దుస్థితిలో పడుతున్నాయన్నారు. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో వాతావరణ మార్పులు తరచూ సంభవిస్తున్నాయని, భారత్‌లో కూడా ఈ మార్పుల వల్ల రైతులు నష్టపోతున్నారని బిల్ గేట్స్ తెలిపారు. సదస్సును ప్రారంభించిన వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రసంగిస్తూ భారత్ వ్యవసాయ ఆధారిత దేశమని పేర్కొన్నారు.
*చిత్రం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్