జాతీయ వార్తలు

ఉభయ సభల్లో విపక్షాల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు మంగళవారం ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే జేఎన్‌యూ ఘటన, జమ్మూకాశ్మీర్ వ్యవహరం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నాయకులు రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రత తొలగింపుపై కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వీటిపై చర్చను చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. అనంతరం పలు అంశాలపై కాంగ్రెస్, డీఎంకే సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేస్తున్న సభ్యుల వైఖరిపై స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం, రైతుల సమస్యలపై ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇస్తున్నారని.. పోడియం నుంచి సభ్యులు తమ స్థానాల్లో కూర్చుని ప్రశ్నలను లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలు
ప్రస్తావించే అన్ని అంశాలపై సరైన మార్గంలో వస్తే.. చర్చించేందుకు సమయం ఇస్తానని స్పీకర్ ఆందోళన చేస్తున్న సభ్యులను ఉద్దేశించి చెప్పారు. అప్పటికీ శాంతించకపోవడంతో బుధవారం నుంచి సభ్యులు పోడియం వద్దకు వస్తే చర్యలు తప్పవని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ గాంధీ కుంటుంబ సభ్యులు సామాన్య వ్యక్తులు కారని.. అత్యవసరంగా వారికి ఎస్పీజీ భద్రతను ఎందుకు ఉపసంహరించారని ప్రశ్నించారు. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. ప్రధానిగా వాజపేయి ఉన్న సమయంలోనూ ఎస్పీజీ భద్రతను కొనసాగించారని, ఇప్పుడు ఎందుకు ఉపసంహరించారని నిలదీశారు. దీనిపై ప్రధాని మోదీ, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం విపక్ష సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభ ఒకసారి వాయిదా
విపక్ష సభ్యుల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. జమ్మూకాశ్మీర్ వ్యవహరం, జేఎన్‌యూ ఘటన, తమిళనాడులో విద్యార్థి ఆత్మహత్యపై వామపక్ష, ఆప్ పార్టీల సభ్యులు 267 నిబంధన కింద చర్చకు నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. దీనికి అసంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు నోటీసులు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టడంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే మృతికి సభ రెండు నిమిషాలు వౌనం పాటించింది. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీని సభ అభినందించింది. భారతదేశానికి ఇది గర్వకారణమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

*చిత్రం...లోక్‌సభలో మంగళవారం పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తున్న విపక్షాలు