జాతీయ వార్తలు

ఎస్సీ యువత సంక్షేమానికి రూ.100 కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: తెలంగాణలోని షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులతో కలిసి ఈశ్వర్ మంగళవారం మహేంద్రనాథ్ పాండేను పార్లమెంట్‌లో కలిశారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ ఎస్సీ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. అలాగే కేంద్ర సహజ వాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి దివ్యాంగుల సంక్షేమానికి రూ.10కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు.