జాతీయ వార్తలు

పెరుగుతున్న సముద్ర నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: గత 50 సంవత్సరాల్లో దేశంలోని తీర ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టం కనీసం 8.5 సెంటీమీటర్లు పెరిగిందని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మంగళవారం రాజ్యసభలో తెలియజేశారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు కచ్చితంగా వాతావరణంలో వస్తున్న మార్పులే కారణమని చెప్పలేమని సభ్యులు లిఖితపూర్వకంగా అడిగిన ఓ ప్రశ్నకు పర్యావరణ శాఖ సహాయ మంత్రి సుప్రియో తెలిపారు. ‘ఏటా సుమారు సముద్ర నీటి మట్టం 1.70 మిల్లీ మీటర్ల చొప్పున పెరుగుతూ వస్తోంది.. తీర ప్రాంతాల్లో ఐదు దశాబ్దాల్లో 8.5 సెంటీమీటర్లు పెరిగింది’ అని మంత్రి స్పష్టం చేశారు. 2003 నుంచి 2013 వరకు సంవత్సరానికి సముద్ర నీటి మట్టం 6.1 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ వచ్చిందని వివరించారు. నీటిమట్టం ఈ విధంగా పెరుగుతూ పోవడం వల్లే సునామీ, తుపాను ఉప్పెనలు, వరదలు, తీర ప్రాంతాలు కోతగురౌతూ వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని కచ్చితంగా చెప్పలేమని మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో భూసారం దెబ్బతింటోందని పేర్కొన్నారు. డైమండ్ హార్బర్‌తో పాటు, కాండ్లా, హల్దియా, పోర్టుబ్లెయిర్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్బన్ ఉద్గారాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికలో పలు దేశాలను హెచ్చరించింది.