జాతీయ వార్తలు

కొత్త జిల్లా కేంద్రాల్లో వైద్య కాలేజీలు మంజూరు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లా కేంద్రాలలో వైద్య కళాశాలలను మంజూరు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌కు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేంద్ర మంత్రితో ఈటల భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ యాస్పిరేషనల్ జిల్లాల కింద కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సంబంధించిన ఏడు జిల్లాల నుంచి ప్రతిపాదనలను ఇచ్చామని.. వాటిలో రెండు లేదా మూడు జిల్లాల్లో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామని అన్నారు. ఇటీవల క్యాన్సర్, కీడ్నీకి సంబంధించిన వ్యాధులతో అధిక మరణాలు సంభవిస్తున్నాయని, వీటి నివారణలకు తెలంగాణలో అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కొత్తగా రీజినల్ క్యాన్సర్ సెంటర్లు మంజూరు చేయాలని కోరామన్నారు. అలాగే నీలోఫర్, గాంధీ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకులు మంజూరు చేయాల్సిందిగా కోరమన్నారు. ఇక తెలంగాణలోని జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు గుర్తించిన 11 ప్రధాన కేంద్రాల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, దానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు ఇవ్వామని కోరగా.. ఆయుష్మాన్ భారత్‌లో చేరమని చెబుతున్నారని.. కాని నిధులపై స్పదించడం లేదని మంత్రి ఈటల తెలిపారు.